![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -828 లో..... కావ్య గురించి డాక్టర్ చెప్పింది గుర్తు చేసుకొని అప్పు బాధపడుతుంటే కళ్యాణ్ వస్తాడు. అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి కావ్యకి విషయం చెప్పారా అని అడుగుతుంది. లేదని అప్పు అనగానే ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావ్.. త్వరగా చెప్పమని అప్పుపై డాక్టర్ సీరియస్ అవుతుంది.
ఈ విషయం ఎలాగైనా అక్కతో చెప్పాలని కళ్యాణ్ తో అప్పు అంటుంది. మరొకవైపు రేవతి ఇంట్లో అందరికి లడ్డులు ఇస్తుంది. ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో కలనే వేరు అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత నా కూతురిని నేను బాగా చూసుకుంటానని రాజ్ అందరితో హ్యాపీగా చెప్తాడు. అంటే నువ్వు కూతురు పుడుతుందని ఫిక్స్ అయ్యావా అని ధాన్యలక్ష్మి అంటుంది. అప్పుడే అప్పు, కళ్యాణ్ వస్తారు. అప్పు నాకు ఎవరు పుడతారని కావ్య అడుగుతుంది. నీకెవరు పుట్టరని డాక్టర్ చెప్పింది చెప్పగానే కావ్య కళ్ళు తిరిగి పడిపోయినట్లు అప్పు ఉహించుకొని కావ్యకి నిజం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఏమైంది అప్పు అని కావ్య అనగానే తనని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది.
ఆ తర్వాత ఏంటి అప్పు మీ అక్కకి నిజం చెప్తానని అన్నావ్ చెప్పలేదేంటని కళ్యాణ్ అడుగుతాడు. అక్కకి నిజం చెప్తే తట్టుకోలేదని అప్పు అంటుంది. అయితే మా అన్నయ్యకి నిజం చెప్తానని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ ఇంటికి రాగానే అన్నయ్య నీతో మాట్లాడాలి బయటకు వెళ్దామని కళ్యాణ్ టాడు. తరువాయి భాగంలో రాజ్ కి కావ్య గురించి నిజం చెప్తాడు కళ్యాణ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |